పోటాపోటీగా నాని – దేవరకొండ రిలీజ్ లు!

Vijay Deverakonda - Naniసెకండ్ లీగ్ లో నాని – విజయ్ దేవరకొండల మధ్య తీవ్రపోటీ నెలకొన్న విషయం ట్రేడ్ వర్గాలలో హాట్ హాట్ చర్చలకు దారి తీసింది. నాని ‘దేవదాస్’ కంటే ఉత్తమమైన ఓపెనింగ్ డే ను అందుకున్న విజయ్ దేవరకొండ ‘నోటా’ లాంగ్ రన్ లో ‘దేవదాస్’ను రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాలి.

[m9ad]

ADVERTISEMENT

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ గత చిత్రం ‘గీత గోవిందం’ నుండి ఓ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వచ్చిందమ్మా’ అంటూ సాగే పెళ్లి పాటను విడుదల చేయగా, మరికొద్దిసేపటికే ‘దేవదాస్’ నుండి ‘చెట్టు కింద ప్లీడరు’ అన్న జోష్ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

దీంతో బాక్సాఫీస్ వద్దే కాదు, యూ ట్యూబ్ లో కూడా ఈ ఇద్దరి హీరోల మధ్య అనుకోకుండానే పోటీ నెలకొంటోంది. ఏది ఏమైతేనేం… ప్రేక్షకులకు మాత్రం ఈ పాటలు కన్నులవిందుగా మారాయి. ‘గీత గోవిందం’ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోగా, ‘దేవదాస్’ రెండవ వారంలోకి అడుగుపెట్టింది.

ADVERTISEMENT
Latest Stories