
పరిశ్రమలంటే పరిశ్రమలను రాష్ట్రానిలి రప్పించేందుకు ప్రభుత్వాలు పడే శ్రమ. ఒక నాయకుడిని నమ్మి, ఒక ప్రభుత్వ విధానానికి ఆకర్షితుడై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక పారిశ్రామిక వేత్త ముందుకొస్తున్నాడు అంటేనే అది ఆ నాయకుడి విజయంగా, ప్రభుత్వ గౌరవముగా భావించాలి.
గత ఐదేళ్లు పెట్టుబడుల రహిత రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రెస్ గా మార్చాలనే ఉద్దేశంతో ఏపీ ఐటీ మంత్రి నారాలోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా పేరోట్, టెస్లా సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.
పేరోట్ గ్రూప్ అండ్ హిల్ వుడ్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పేరోట్ జూనియర్ తో లోకేష్ భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను వివరించి తమ ప్రాంతంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. అలాగే టెస్లా CFO వైభవ్ తనేజాతో భేటీ అయిన లోకేష్ టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్లకు ఏపీలోని అనంతపురం జిల్లా అనువైన ప్రదేశమని ఆయా ప్రతినిధులతో చర్చలు జరిపారు.
2029 నాటికి ఏపీలో 72 GW రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తే తమ ప్రభుత్వ లక్ష్యమని దీనికి టెస్లా వంటి గ్లోబల్ కంపనీల సహాయ సహకారాలు తమ రాష్ట్రానికి అవసరమని టెస్లా ప్రతినిధులను ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు మంత్రి లోకేష్.
అయితే తండ్రి చంద్రబాబు కియా, హీరో మోటర్స్ వంటి ఆటోమొబైల్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తే లోకేష్ టెస్లా వంటి ఇంటర్ నేషనల్ గ్రీన్ ఎనర్జీ రంగాల మీద ద్రుష్టి పెట్టారు. ఇటువంటి పెద్ద సంస్థలతో ఏపీలో పెట్టుబడులు పెట్టించగలిగితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు ఆయా కుటుంబాలకు ఉన్నత జీవన ప్రమాణాలు దక్కుతాయి.
దీనితో కూటమి ప్రభుత్వం ముందున్న ‘ఏపీ పునర్నిర్మాణ’ లక్ష్యం రాబోయే ఐదేళ్లలో కొంతవరకు సాధ్యమవుతుంది. ఇదిలా ఉంటే, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్రానికి వచ్చిన ఫిష్ మార్కెట్లు, మటన్ మార్కెట్ల పరిశ్రమల పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అలాగే గుడ్డు అమర్నాధ్ గా మారిన గుడివాడ అమర్నాధ్ మాజీ ఐటీ మంత్రి ‘గుడ్డు’ సిద్దాంతం వీడియో కూడా వైరల్ అవుతుంది.
Prime Minister Narendra Modi is reportedly set to meet India’s Asian Games gold winning cricket…
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…