Telugu

రాప్తాడు ఘటన: ఒక దురదృష్టం వెంటే అదృష్టం!

అనంతపురం జిల్లా రాప్తాడులో జడ్పీటీసీ పాఠశాల విద్యార్థినిపై హేమంత్ అనే యువకుడు చెట్లు కోసే రంపం మెషిన్‌తో దాడి చేసిన ఘటన తెలిసిందే.

కండలు తిరిగిన వీరులు సైతం అలాంటి భయంకరమైన దాడిని తట్టుకోలేరు. మరి ఆ బాలిక తట్టుకోగలదా? ఆమె జీవితంలో ఇది అత్యంత భయంకరమైన ఘటన. ఈ భయం, బాధ, ఆమెను జీవితాంతం మానసికంగా, శారీరకంగా వెంటాడుతూనే ఉంటుంది.

ADVERTISEMENT

ఇంత తీవ్రంగా గాయపడిన ఆ బాలిక బ్రతకడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకున్నారు. అవే ఆ బాలిక ప్రాణాలు కాపాడాయని చెప్పవచ్చు.

ఈ ఘటన జరిగిన వెంటనే మంత్రి నారా లోకేష్‌ ఆమెను బెంగళూరులోని మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించేందుకు చకచకా ఏర్పాట్లు చేశారు.

ముందుగా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆమెను అనంతపురం నుంచి వేగంగా బెంగళూరు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు.

ఆమె అక్కడకు చేరుకునేలోగా మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి, తక్షణం ఆమెకు అవసరమైన శస్త్ర చికిత్సలు చేసేందుకు నిపుణులైన వైద్య బృందాలు సిద్ధంగా ఉండేలా చేశారు.

ఆమె అంబులెన్సులో హాస్పిటల్ చేరుకోగానే అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు ఆమెకు అవసరమైన శస్త్రచికిత్సలు చేశారు.

ఆమెను అక్కడకు పంపించడంతో తన పని పూర్తయిపోయిందని మంత్రి నారా లోకేష్‌ చేతులు దులుపుకోలేదు. ఆ బాలిక తల్లి వద్దకు వెళ్ళి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత నిరంతరం మణిపాల్ వైద్యులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు.

మంత్రి నారా లోకేష్‌ ‘ఎక్స్‌’లో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు సమాచారం ఇచ్చారు.

“ఆ బాలిక ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం పూర్తిగా స్పృహలో ఉండటంతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీలో కూర్చుంటోంది. వైద్యులు ఆమెకు ఘన ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. ఈరోజు మరి కొన్ని అడుగులు నడిపించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మీ అందరి ప్రార్థనలతో ఆమె కోలుకుంటోంది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!” అని ట్వీట్‌ చేశారు.

స్కూల్లో జరిగిన ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనది. కానీ మంత్రి నారా లోకేష్‌ స్వయంగా పూనుకొని, ఇన్ని ఏర్పాట్లు చేసి ఆ బాలిక ప్రాణాలు కాపాడటం ఆమె అదృష్టమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jagan’s Home Turf: TDP Wins Pulivendula, Mydukur ZPTCs

The Telugu Desam Party (TDP) has secured significant victories in YSR Kadapa district during the…

15 minutes ago

JanaSena Candidate Wins MPTC Election After Her Death

In a tragic development during the Andhra Pradesh parishad elections, JanaSena candidate Garapati Divya won…

40 minutes ago