మా ఎర్రడైరీలో చాలామంది పేర్లే ఉన్నాయి.. అందరూ జైలుకే!

Nara-Lokesh-Red-Diary

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో కొన్ని తన పాదయాత్ర, భవిష్య కార్యాచరణ వగైరాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకొన్నారు. క్లుప్తంగా ఆ వివరాలు…

· ప్రజాసమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకే పాదయాత్ర చేశాను తప్ప జగన్‌లాగ ముఖ్యమంత్రి పదవి కోసం కాదు.

ADVERTISEMENT

· నేను ఏదో ఓ వారం రోజులు పాదయాత్ర చేసి ఇక చేయలేక మానేస్తానని వైసీపి నేతలు అనుకొన్నారు. 42 డిగ్రీల మండుటెండల్లో, వర్షంలో కూడా పాదయాత్ర చేశాను. అయినా నేటికీ వాళ్ళ నోళ్ళు మూతపడటం లేదు.

· యువగళం పాదయాత్రని పోలీసులతో అడ్డుకోవడానికి వైసీపి ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత వైసీపి కార్యకర్తల చేత నాపై భౌతికదాడులు చేయించింది. కానీ ప్రజల అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు.

· మద్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించి, మా అందరిపై కేసులు పెట్టి వేధించడంతో యువగళం పాదయాత్ర ఆలస్యమైంది. లేకుంటే ఇచ్చాపురం వరకు పూర్తిచేసేవాడిని.

· జగన్‌ అరాచక, అవినీతి పాలనతో వేసారి పోయున్న ప్రజలు మార్పు కోరుకొంటున్నారని యువగళం పాదయాత్రలో గమనించాను.

· ఈ నాలుగున్నరేళ్ళలో మా పార్టీ నేతలని, కార్యకర్తలని వేధించిన ప్రతీ అధికారి పేరు ఎర్రడైరీలో వ్రాసుకొంటున్నాము. మేము అధికారంలోకి రాగానే వారందరిపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకొంటాము. అప్పుడు మా టిడిపి నేతలను వెంటబెట్టుకొని మా దగ్గరకు వచ్చినా ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. గీత దాటిన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయి కానీ జగన్‌ ప్రభుత్వంలాగా ఎవరినీ వెంటపడి వేధించబోము.

· జగన్‌ పాలనలో జరిగిన ఆర్ధిక, సామాజిక, పారిశ్రామిక, మౌలిక విధ్వంసాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. కనుక ముందుగా వాటిన్నిటినీ సరిచేసి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది.

· తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు రప్పించి యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాము.

· అమరావతి, పోలవరం నిర్మాణాలు వేగవంతం చేస్తాము. విశాఖను ఐ‌టి, ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా తీర్చి దిద్దుతాము.

· ఇసుక, విద్యుత్, విద్య తదితర రంగాలలో జగన్‌ ప్రభుత్వ చెత్తపాలసీలను అన్నిటినీ రద్దు చేసి ప్రజాభీష్టానికి తగ్గట్లుగా కొత్త విధానాలు రూపొందిస్తాము.

· జగన్‌ ప్రభుత్వం ప్రజలపై మోపిన ఆర్ధిక భారాన్ని తగ్గిస్తాము.

· యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతీ హామీకి, అలాగే మా టిడిపి, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చే ప్రతీ హామీకి మా ప్రభుత్వం, మా పార్టీలు కట్టుబడి ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories