ఫ్యాన్ కనెక్షన్ తీసేయాల్సిందే!

Nara Lokesh Yuvagalam Padayatraటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నేడు 135వ రోజున వెంకటగిరి నియోజకవర్గంలో చేస్తున్నారు. పట్టణంలో పాట బస్టాండ్ వద్ద ఈరోజు బహిరంగసభ నిర్వహించగా ఆ ప్రాంతంలో రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. నారా లోకేష్‌తో పాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రమంతటా అరాచకాన్ని వ్యాపింపజేసి ఒకప్పటి బిహార్‌ రాష్ట్రంలాగ మార్చేశారన్నారు. చివరికి బడికి వెళ్ళే పిల్లలని కూడా వైసీపీ నేతలు అతిదారుణంగా హత్యలు చేస్తున్నారని నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అరాచక పరిస్థితులకు ఇది పరాకాష్ట అని అన్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు విశాఖకు ఐ‌టి కంపెనీలు తీసుకువస్తే జగన్ ప్రభుత్వం వాటన్నిటినీ అక్కడి నుంచి తరిమికొట్టేసి, గంజాయి, భూకబ్జాలు, కిడ్నాపులకు రాజధానిగా మార్చేసిందన్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్నే కిడ్నాప్ చేసిన ఘటనను నారా లోకేష్‌ వెంకటగిరి ప్రజలకు గుర్తు చేశారు.

ఏపీలో ఈ వేధింపులు, అరాచకాలను భరించలేక ఐ‌టి కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు చివరికి వైసీపీ ఎంపీ కూడా హైదరాబాద్‌ పారిపోయి అక్కడ వ్యాపారాలు చేసుకొంటున్నారని నారా లోకేష్‌ అన్నారు. మరో ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో అడుగు పెట్టేందుకు భయపడి ఢిల్లీలోనే కాలక్షేపం చేయాల్సి వస్తోందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చని అన్నారు.

ఏపీలో ప్రతీరోజు ఎక్కడో అక్కడ హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు, భౌతిక దాడులు సర్వసాధారణమైపోయాయని, కేవలం నాలుగేళ్ళలోనే ఏపీలో పరిస్థితులు ఇంతగా మారిపోతాయని బహుశః ఎవరూ ఊహించి ఉండరన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇదేవిదంగా కొనసాగితే సామాన్య ప్రజలు కూడా బ్రతకలేని పరిస్థితి వస్తుందని నారా లోకేష్‌ అన్నారు.

జగన్ ప్రభుత్వం ఓ చేత్తో సంక్షేమ పధకాలు ఇచ్చిన్నట్లే ఇచ్చి మరో చేత్తో ప్రజలపై విద్యుత్‌ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్తపన్ను అంటూ రకరకాల పేర్లతో డబ్బులు పిండుకొంటోందన్నారు. ఒక్క మే నెలలోనే విద్యుత్‌ చార్జీల పేరుతో ప్రజల నుంచి రూ.11,300 కోట్లు వసూలు చేసిందని అన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు తప్పడం లేదని, కనుక (వైసీపీ ఎన్నికల చిహ్నం) ఫ్యాన్ కనెక్షన్ తీసేయక తప్పదని నారా లోకేష్‌ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories