విభిన్నమైన కధంశాలతో ప్రేక్షకుల మదిలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం “తుంటరి” ఆడియో ఆవిష్కరణ వేడుక తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ‘ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ తో విజయాలు అందుకున్న రోహిత్, ఈ సారి సినిమాలో ఎవర్ని కొట్టకుండా గెలవాలనుకుంటున్నారు. ఆందుకే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా “తుంటరి” రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ వేడుకపై విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ ఇదే విషయాన్ని ఖరారు చేసింది. హీరోయిన్ వెంటపడి, ఆమె ప్రేమ కోసం పరితపించే పాత్రలో నారా రోహిత్ (స్వరూపాన్ని పక్కన పెడితే) కాస్త కొత్తగా కనపడుతున్నారు. ‘గుండెల్లో గోదారి’ సినిమాలో మిస్సైన కమర్షియల్ అంశాలను ఈ సినిమాలో దర్శకుడు కుమార్ నాగేంద్ర పక్కగా ప్లాన్ చేసినట్లు బాక్సింగ్ ఎపిసోడ్ చెప్తోంది. అలాగే వరుసగా నారా రోహిత్ సినిమాలకు సంగీతం అందిస్తున్న సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
నారా రోహిత్ నటించిన సినిమాలన్నీ ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, భారీ కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. బహుశా ఈ “తుంటరి” అయినా రోహిత్ ఆకాంక్షను నేరవేరుస్తుందేమో చూడాలి.



