జోరుమీదున్న నారా రోహిత్… 3వ సినిమా ఫస్ట్ లుక్!

nara-rohith-raja-cheyyivesthe-poster1ఇప్పటికే రెండు సినిమాల ఆడియోల విడుదల జరుపుకుని, జోరుమీదున్న నారా రోహిత్ మహాశివరాత్రి సందర్భంగా మరో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న “రాజా చెయ్యి వేస్తే” సినిమా ఫస్ట్ లుక్ అదిరింది.

ADVERTISEMENT

బుల్లెట్ పై నారా రోహిత్ వెళ్తున్న సీన్, ఫైటింగ్ నేపధ్యంలోని బ్యాక్ గ్రౌండ్ చూడగానే నారా రోహిత్ మార్క్ సినిమా మాదిరి దర్శనమిస్తున్నాయి. “తుంటరి, సావిత్రి” సినిమాలతో ఫ్యామిలీ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న రోహిత్, మళ్ళీ తన మునుపటి యాక్షన్ మార్క్ సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నారని “రాజా చెయ్యి వేస్తే” ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పింది.

ADVERTISEMENT
Latest Stories