మోడీ, అమిత్ షాలతో పెట్టుకుంటే కేసులు కదులుతాయి…. మరెలా?

టిడిపి, జనసేనలతో బీజేపీ కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయం అయిన్నట్లే. సీట్ల సర్దుబాటు కోసమే అధికారిక ప్రకటన వెలువడలేదు. వెలువడితే అప్పుడు బీజేపీ, మోడీ, అమిత్ షాలపై జగన్‌ అస్త్రాలు సందించక తప్పదు. కానీ మరీ జోరుగా సంధించినా ఆ ధాటికి అక్రమస్తుల కేసులు, వివేకా హత్య కేసులో కదలికలు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది.

అలాగని విమర్శించకుండా ఊరుకుంటే చెల్లి ఊరుకోదు. జగనన్న ఢిల్లీ వెళ్ళి మోడీతో రహస్య అవగాహన కుదుర్చుకుని వచ్చాడని కోడై కూస్తుంది.

ADVERTISEMENT

సొంత చెల్లి కావడంతో ఆమెను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక జగన్మోహన్‌ రెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మోడీ, అమిత్ షాలను విమర్శించాలన్నా జగన్‌కు సరిగ్గా అటువంటి ఇబ్బందే ఎదురవుతుంది.

కానీ వారికి బదులు ‘కేంద్ర ప్రభుత్వాన్ని’ విమర్శించడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. విమర్శించడానికి చాలా అస్త్రాలు ‘సిద్దం’గా ఉన్నాయి కూడా.

జగన్మోహన్‌ రెడ్డి ఇంతకాలం మరిచిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుండటం, ఇంకా అనేక విభజన హామీలు, నిధులు వంటి వాటి గురించి నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. వాటిపై ఎన్ని విమర్శలు చేసినా అవన్నీ ఎన్నికల కోసం చేస్తున్న కాలక్షేప విమర్శలే అని మోడీ, అమిత్ షాలకు కూడా తెలుసు. కనుక వారు కూడా వాటిని లైట్ తీసుకుంటారు.

ఇప్పుడు చెల్లిని తిట్టాల్సి వచ్చినప్పుడు ఆమెకు బదులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను తిడుతునట్లే, రేపు మోడీ, అమిత్ షాలను తిట్టాల్సివచ్చినా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లే తిట్టుకునే స్వేచ్ఛ, వెసులుబాటు రెండూ ఉన్నాయి.

టిడిపి, జనసేన, బీజేపీలను ఏదో విదంగా ఎదుర్కోవచ్చు కానీ ‘జగనన్నా…’ అంటూ రోజూ ఏకి పడేస్తున్న వైఎస్ షర్మిలని ఏవిదంగా ఎదుర్కోవాలో సలహాదారుల గుంపులో ఏ ఒక్కరూ చెప్పడం లేదు. కానీ ఆమె నోటిని కట్టడి చేయకపోతే సంక్షేమ పధకాలన్నీ చెరువులో పిసికిన చింతపండులా వృధా అయిపోయే ప్రమాదం ఉంటుంది.

షర్మిల చెల్లి ‘నా ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందంటూ’ తనపై వైసీపి ఈగలు వాలకుండా ముందే జాగ్రత్త పడింది. మరో వైపు బావ బ్రదర్ అనిల్‌నీ ఓ కంట కనిపెట్టుకుని చూస్తుండక తప్పదు. బీజేపీ పుణ్యామాని వైసీపికి దక్కబోయే మైనార్టీ ఓటు బ్యాంకుకి ఆయన అప్పుడే కన్నం పెట్టేస్తున్నారు కదా?

ఎప్పుడో విసిరి పారేసిన బాణమే ఇప్పుడు ఇలా వచ్చి గొంతులో గుచ్చుకుంటుంటే ఆ బాధ ఎలా చెప్పుకోవాలి… ఎవరికి చెప్పుకోవాలి?ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఏం ప్రయోజనం? హే ప్రభూ… ప్రజలకు మేలు చేయాలని తాపత్రయపడుతున్న నాకే ఎందుకీ కష్టాలు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

PM Modi, CM Vijay Take Chennai Metro Ride Together

Prime Minister Narendra Modi inaugurated the Poonamallee-Vadapalani corridor of Chennai Metro Phase II during his…

14 minutes ago

శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్.. ఈ ఉపశమనం అవసరమే!

రాజకీయాలు హుందాగా సాగుతున్నప్పుడే రాష్ట్రాలలో, దేశంలో రాజకీయ వాతావరణం కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలలో అటువంటి హుందాతనం తగ్గిపోయింది.…

21 minutes ago