
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉండగా, ఇప్పటికే ఒక హీరోయిన్ ఎంపిక జరిగిందని ట్రేడ్ టాక్. ఎప్పుడూ ప్రేమ వార్తలతో సంచలనంగా మారే ‘ముదురు భామ’ నయనతారను ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని, మరో హీరోయిన్ కోసం అన్వేషణ చేస్తున్నారని హల్చల్ చేస్తున్న వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియాలి.
అయితే, కొన్ని రోజుల క్రిందట మురుగదాస్ చిత్రంలో మహేష్ బాబు సరసన కూడా నయనతార నటిస్తోందని పుకార్లు షికారు చేయగా, వాటిని స్వయంగా దర్శకుడు మురుగదాస్ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి తాజాగా సందడి చేస్తున్న పవన్ – నయనతార కాంభినేషన్ పై ఎవరు వివరణ ఇస్తారో గానీ, పవన్ కు జతగా నయన సూట్ కాకపోవచ్చన్నది అభిమానుల మాట.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…