ట్రైలర్ టాక్ – ఏ మాత్రం రుచించని రొటీన్ సస్పెన్స్!

Nayanthara VASUKI Trailer Talkటాప్ హీరోయిన్లు నటించిన హార్రర్ అండ్ సస్పెన్స్ సినిమాల సక్సెస్ రేటు చాలా తక్కువ. చిన్న హీరోయిన్లు నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయి గానీ, అగ్ర హీరోయిన్లకు మాత్రం ఆ అవకాశం లభించలేదు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే త్రిష వంటి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుని, మరోసారి హార్రర్ ఊసేత్తకుండా గ్లామర్ పాత్రలను పోషించుకుంటూ కాలం గడుపుతుండగా, ఇప్పటికే ‘మయూరి, డోర’ సినిమా ద్వారా హార్రర్ అండ్ సస్పెన్స్ జోన్ లో నటించిన నయనతార మరోసారి “వాసుకి” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ట్రైలర్ విడుదలైంది.

‘డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్’ అంటూ నయనతార చెప్పిన డైలాగ్ తో ఆరంభమైన ట్రైలర్ రొటీన్ హార్రర్ సస్పెన్స్ గా సాగగా, ఇందులో నయనతార లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ ను బట్టి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆత్మ ‘వాసుకి’ రోల్ పోషిస్తున్న నయనతారను ఆవహించడం, తద్వారా తన రివేంజ్ ను ఎలా తీర్చుకుందనేది చిత్ర ప్రధాన కధగా కనపడుతోంది. గోపి సుందర్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు అనుగుణంగా ఉండగా, ఇలాంటి రొటీన్ సస్పెన్స్ లను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయంలో స్క్రీన్ ప్లేదే కీలక పాత్ర.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories