ప్రియుడి కోసం డబ్బులు వెదజల్లుతున్న స్టార్ హీరోయిన్

Nayatara spends 25 lakhs for Vignesh Shivan Birthdayఅగ్ర నటి నయనతారకు తన ప్రేమ జీవితంలో గతంలో చాలా చెడ్డ అనుభవాలు ఉన్నాయి. శింబు, ప్రభుదేవా వంటి వారితో ఆమె డేటింగ్ చేసి ఆ తరువాత వారితో విడిపోవడాన్ని మేము చూశాము. ఆమె గత కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌ తో కలిసి ఉంటుంది. నయన్, విఘ్నేష్ నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు.

కెరీర్‌లో అనుకున్నవి సాధించాకనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ వెల్లడించాడు. ఈ జంట తరచుగా తమ హాలిడే కోసమంటూ అనేక దేశాలు చుట్టివస్తూ ఉంటారు. అయితే కరోనా కారణంగా ఈ సారి అది కుదరకపోవడంతో గోవా తో సరిపెట్టుకుంది ఈ జంట. నయనతార ఇటీవలే గోవాలో విఘ్నేష్ పుట్టినరోజు జరిపింది.

ADVERTISEMENT

వారి మూడు రోజుల పర్యటన కోసం ఆమె 25 లక్షలు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార విఘ్నేష్ శివన్ తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో ఆమె ప్రధాన నటీమణులలో ఒకరిగా కూడా కనిపిస్తుంది.

ఇలా ప్రియుడి కోసమంటూ డబ్బులు వెదజల్లుతుంది ఈ స్టార్ హీరోయిన్. నయనతార దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్. తెలుగులో ఆమెకు పెద్దగా డిమాండ్ లేకపోయినా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. కాబట్టి పాతిక లక్షలు ఆమెకు పెద్ద లెక్క కాదు.

ADVERTISEMENT
Latest Stories