నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఓ ఉదంతం గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మహిళా పోలీస్ యూనిఫామ్ కోసం కొలతలు తీసుకునే వ్యక్తి ఓ పురుషుడు అయి ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
మహిళా హోమ్ మంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా? అన్న అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. స్వయానా పోలీసులకే ఇలా జరిగితే, ఇంకా సాధారణ మహిళల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు జవాబు లేకుండా పోతోంది.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోన్న ఈ ఫోటోలు, వీడియోలపై నెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు. ముందుగా జెంట్ టైలర్ ను తొలగించి, ఆ స్థానంలో మహిళా టైలర్ ను నియమించి, సోషల్ మీడియాలో సదరు ఫోటోలను పోస్ట్ చేసారు.
అసలు అనుమతి లేని ఇలాంటి ప్రదేశాలలో ముందుగా ఫోటోలు తీసిన గుర్తు తెలియని వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా టైలర్స్ ను నియమించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసారు.
నెల్లూరు జిల్లా పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో చాలా ప్రాధాన్యతను దక్కించుకుంది. సుచరిత హోమ్ మంత్రిగా విధులు నిర్వహిస్తోన్న జగన్ సర్కార్ ప్రభుత్వంలో… మహిళా పోలీసులకు దక్కిన గౌరవమంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
నెల్లూరు మహిళా పోలీసుల యూనిఫామ్ సైజులని తీసుకోవటానికి జగన్ పోలీసులని డ్యూటీ వేసిన @APPOLICE100 లు.😠
మహిళల డ్రెస్ సైజులు పురుషులు తీయడమే జగన్ రెడ్డి చేసే రివర్స్ పరిపాలన.😡
మహిళల పట్ల ఈ YCP Govt చేస్తున్న ఈ ఘోరాన్ని అందరూ ఖండించండి.😢#APUnSafeForWomen #SaveGirlsFromPsychoJagan pic.twitter.com/ZJD7NYuBFr
— Balaji Gupta (@BalajiGupta) February 7, 2022
నెల్లూరు పోలీస్ గ్రౌండ్ యందు మహిళా పోలీస్ యూనిఫామ్ సైజు లని తియ్యడానికి పురుష పోలీస్ లని డ్యూటీ వేసి ఉన్నారు.
సర్ అమ్మాయిలం అయినా మేము చాల ఇబ్బంది పడతా ఉన్నాం సర్…మహిళల సైజులు పురుషులు తియ్యడమేంటి సర్
మహిళలకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా.. .?@SucharitaYSRCP pic.twitter.com/BEpRKrdckD
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) February 7, 2022
నెల్లూరు పోలీస్ గ్రౌండ్ యందు మహిళా పోలీస్ యూనిఫామ్ సైజు లని తియ్యడానికి పురుష పోలీస్ లని డ్యూటీ వేసి ఉన్నారు.
మహిళల సైజులు పురుషులు తియ్యడ మేంటి సర్…
బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 🤦🤦 pic.twitter.com/vDh8cePcN2— 𝙿𝚁𝙰𝚅𝙴𝙴𝙽 𝙹𝙰𝙻𝚄𝙼𝚄𝚁𝚄 (iTDP) 🏹 (@Praveen_633) February 7, 2022



