నాని ‘సూపర్’ అన్న ట్రైలర్ వచ్చేస్తోంది!

Nene Raju Nene Mantri - Trailerఫస్ట్ లుక్ తో మొదలైన రానా “నేనే రాజు నేనే మంత్రి” హంగామా, ఇటీవల విడుదలైన టీజర్లతో బాగానే మోత మోగింది. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై బజ్ ఏర్పడే విధంగా టీజర్ సంతృప్తి పరచడంతో, ఈ సినిమా ట్రైలర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోనూ టీజర్ విడుదలైన నాడే, ఈ సినిమా ట్రైలర్ ను చూసేసిన నాచురల్ స్టార్ నాని, ‘నేను ట్రైలర్ కూడా చూసేసాను, అదిరిపోయింది’ అంటూ ట్వీట్ చేసాడు.

సామాన్య ప్రేక్షకుల అభిరుచిని క్యాచ్ చేయడంలో నానిది అందెవేసిన చేయి అని, అతను సాధిస్తున్న విజయాలే చెప్తున్నాయి. ఈ తరుణంలో నాని మెచ్చిన ట్రైలర్ అంటే, అది సామాన్య ప్రేక్షకులకు కూడా రీచ్ కావడం తధ్యమని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతోంది అంటారా… దానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది… జూన్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు దర్శనం ఇవ్వనుంది..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories