రకుల్ కాస్ట్యూమ్స్ పై మండిపడుతున్న నెటిజన్లు!

netizens trolls on Rakul Preet singhఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతిదీ పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ క్రమంలో తాజాగా చేసిన ఓ ప్రయత్నం ఈ ముద్దుగుమ్మకు బాగా దెబ్బకొట్టింది. తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

[m9ad]

ADVERTISEMENT

‘మనలోని చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండిపోనివ్వాలి’ అంటూ అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ కాస్ట్యూమ్ పై ఫైర్ అవుతూ… “నీ జాకెట్ చాలా చెత్తగా ఉంది అని ఒకరు, బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారని మరొకరు, సినిమా అవకాశాల్లేక, డబ్బుల్లేక రోడ్ పక్కన కొన్న డ్రెస్సులు వేసుకుంటున్నావా?” అంటూ వివిధ రకాలుగా మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories