తెలుగులో నెక్స్ట్ 1000 కోట్ల హీరో ఎవరు?

Prabhas, Allu Arjun, Ram Charan and N. T. Rama Rao Jr in race to become next 1000 crore hero in Telugu cinema

ఇండియన్ సినిమాకి 1000 కోట్ల మార్కెట్ ను పరిచయం చేసింది “బాహుబలి”. ఏడాది ముందు విడుదల్లైన “దంగల్”ను మొదటి ఇండియన్ 1000 క్రోర్ ఫిలిం అంటారు కానీ.. దాని కలెక్షన్స్ చైనాలో ఎక్కువ వచ్చాయి అది కూడా లాంగ్ రన్ లో. అందుకే ఎవరేమనుకున్నా మొదటి 1000 కోట్ల సినిమా క్రెడిట్ మాత్రం “బాహుబలి”దే.

ఆ తర్వాత హిందీలో షారుక్ ఖాన్ “పఠాన్, జవాన్” లాంటి సినిమాలతో వరుసబెట్టి 1000 కోట్ల సినిమాలు అందుకున్నాడు. యశ్ కూడా “కేజీఎఫ్ 2”తో 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. రీసెంట్ గా వచ్చిన “దురంధర్” రెండు పార్టులు 1000 కోట్ల మార్క్ దాటడం అనేది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ కూడా “పుష్ప 2”తో 1000 కోట్ల క్లబ్ లో కాలు పెట్టాడు. ఎన్టీఆర్-రామ్ చరణ్ లు “ఆర్ఆర్ఆర్”తో 1000 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకున్నా.. క్రెడిట్ రాజమౌళి ఖాతాలోకే వెళ్లిపోయింది.

ADVERTISEMENT

ఇప్పుడు తెలుగులో నెక్స్ట్ 1000 కోట్ల హీరో ఎవరు? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో ప్రభాస్ “స్పిరిట్”, అల్లు అర్జున్ “రాకా”, రామ్ చరణ్ “పెద్ది”, ఎన్టీఆర్ “డ్రాగన్”, యష్ “టాక్సిక్”, షారుక్ “కింగ్” వంటి సినిమాలకి మాత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరే స్కోప్ ఉంది. ఎందుకంటే.. ఇవన్నీ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాలే.

అయితే.. చరణ్ “పెద్ది” సినిమా క్రేజ్ ను, కంటెంట్ ను దృష్టిలో పెట్టుకుంటే 1000 కోట్ల మార్క్ అనేది కష్టమే. ఎన్టీఆర్ “డ్రాగన్”ది కూడా సమె సిచ్యుయేషన్. ఒక్క అల్లు అర్జున్ “రాకా”కి మాత్రమే మంచి ఛాన్స్ ఉంది.

ఎందుకంటే అట్లే-అల్లు అర్జున్ కాంబినేషన్ కేవలం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను మాత్రమే కాక ప్రపంచస్థాయి ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తుంది. దాదాపు 700 కోట్ల బడ్జెట్, క్రేజీ స్టార్ క్యాస్ట్ & ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ వంటివి చూసినప్పుడు “పుష్ప 2” తర్వాత బన్నీ మరోసారి 1000 కోట్ల హీరోగా నిలవడం ఖామమేమో అనిపిస్తుంది. అయితే.. అది కచ్చితంగా అట్లీ డెలివర్ చేసే ప్రోడక్ట్ బట్టి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories