అర్ధమైంది… విక్టరీ ఆల్ రెడీ విజిబుల్ గా ఉంది..!

Ninnu-Kori-Theatrical-Trailer-Talk2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో మొదలైన నాని విజయయాత్ర, ఈ ఏడాది తొలి భాగంలో విడుదలైన ‘నేను లోకల్’ వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటికే ‘డబుల్ హ్యాట్రిక్’ను పూర్తి చేసి, ఇతర హీరోలకు అందనంత ఎత్తులో ఉన్న ఈ ‘నాచురల్ స్టార్,’ మరో హ్యాట్రిక్ ను “నిన్ను కోరి” ద్వారా శ్రీకారం చుట్టబోతున్నాడని ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. జూలై 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ ను ‘పర్ ఫెక్ట్’గా కట్ చేసారు.

‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’గా తెరకెక్కిన ఈ సినిమాలో కాస్టింగ్ అద్భుతంగా కనపడుతోంది. నాని అభినయం, నివేతా థామస్ లుక్స్, ఆది పినిశెట్టి అప్పిరియన్స్… టోటల్ గా సినిమాకు ఫ్రెష్ లుక్ ను తీసుకువచ్చింది. ఇక ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్… ‘మీరు చూడబోతున్నారు… హం ఆప్కే కౌన్,’ ‘చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను,’ ‘నీకు అర్ధమవుతుందా… నాకు గెలుపు ఆల్ రెడీ మొదలైపోయింది’ వంటి డైలాగ్స్ సందర్భానుసారమైన హార్ట్ టచింగ్ డైలాగ్స్ కు కొదవలేదన్న సంకేతాలు ఇచ్చేసారు.

ADVERTISEMENT

ఇక గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉండగా, డివివి దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో కనపడుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రేమకధా చిత్రాలు వచ్చిన దాఖలాలు లేకపోవడం ప్రధాన ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. గతంలో ఇవే తరహా సినిమాలు చూసి చూసి ప్రేక్షకులు విసిగిపోగా, గత కొంత కాలంగా ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ రాకపోవడంతో, ఈ ట్రైలర్ ఫ్రెష్ గా కనపడుతోంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా విక్టరీపై ఎవరికైనా సందేహం ఉంటుందా? సీ..!

ADVERTISEMENT
Latest Stories