ఆ రిలీజ్ డేట్ ఎన్ని చేతులు మారుతుంది?

Nithiin Rangde -movie Release dateజులై 30… ఈ తేదీలో ఏముందో గానీ చాలా మంది చేతులు మారుతూ వస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి ప్రప్రధమంగా తన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ఆ రోజున విడుదల చెయ్యాలి అనుకున్నాడు. అయితే సినిమా అప్పటికి రెడీ కాదు అనే ఉద్దేశంతో వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత కన్నడ సెన్సేషన్ కేజీఎఫ్ 2 ఆరోజు విడుదల చెయ్యనున్నట్టు వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

తాజాగా ఆ చిత్రం గాంధీ జయంతి అనగా అక్టోబర్ 2న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే తేదీన నితిన్ హీరోగా నటిస్తున్న రంగ్ దే అనే చిత్రాన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోయే నితిన్ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఈ సినిమా కోసమే కేటాయించారు. దీంతో చిత్రీకరణ స్పీడ్ అందుకుంది.

ఇందులో నితిన్ సరసన స్టార్ నటి కీర్తి సురేష్ కథానాయకిగా నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు వరుస ప్లాపులు తరువాత భీష్మతో హిట్ కొట్టిన నితిన్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు.

ఇక రంగ్‌దే’ సినిమాతో పాటు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే సినిమా కూడా నితిన్ చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మరో సినిమా, అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ లో బ్లాక్ బస్టరైన అంధాదున్ అనే సినిమా రీమేక్ కి కూడా నితిన్ పచ్చ జండా ఊపాడు.

ADVERTISEMENT
Latest Stories