‘ఫ్యాన్’ వస్తున్నాడు గనుక ‘పవన్’ తగ్గినట్టే!

Nithin Lie First look poster talkఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లబోయే త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ సినిమా రికార్డు సమయంలో పూర్తి చేసి ఆగష్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేసిన సమాచారం తెలిసిందే. నిజానికి ఈ విషయాన్ని పరోక్షంగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకు టెంకాయ కొట్టినపుడే స్పష్టం చేసారు. విడుదల తేదీ ప్రకటించకపోయినా, ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో పవన్ వెనక్కి జరిగినట్లుగా స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

ఎందుకంటే ఇదే తేదీన పవర్ స్టార్ అభిమాని అయిన హీరో నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ “లై”ను విడుదల చేసిన సందర్భంగా ప్రెస్ నోట్ లో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని స్పష్టం చేయడంతో, పవన్ – త్రివిక్రమ్ ల సినిమా వెనక్కి జరిగిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే పవన్ ను డీకొట్టే సాహాసం నితిన్ చేయరు గనుక!

ఆగష్టులో కాకపోతే, పవన్ ఎప్పుడు వస్తారు? అన్న ప్రశ్నకు కూడా దాదాపుగా సమాధానం లభించింది. వినాయకచవితి సందర్భంగా ఒక వారం ముందుగా ప్రేక్షకులను పలకరించాలని ప్లానింగ్ జరుగుతోందట. ఇందు నిమిత్తం షూటింగ్ ను కూడా ప్రీ పోన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ముందుగా ఏప్రిల్ 2వ వారం నుండి షూటింగ్ కు ప్లాన్ చేయగా, తాజాగా ఇది మొదటి వారం నుండే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. సినిమాల విషయంలో పవన్ చూపెడుతున్న శ్రద్ధతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు

ADVERTISEMENT
Latest Stories