ఈ ప్రశ్నలకు బదులేది?

జగన్ తాను ఎంచుకునే పందాలనే విపక్ష నేతలకు అనుకరించి విమర్శలు గుప్పిస్తారేమో అనే చందంగా రాష్ట్రంలో రాజకీయాలను నడిపిస్తున్నారు .కేంద్రంతో కుమ్మక్కయి బాబు నన్ను అరెస్ట్ చేయించారు అంటూ అప్పట్లో విమర్శించిన జగన్ మరి ఇప్పుడు ఎ కేంద్ర పెద్దల అండతో బాబుని అరెస్టు చేశారో? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డేటా చోరీ అంటూ గగ్గోలు పెట్టిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు సామాన్యుల నుండి వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న ఈ డేటా చోరీని ఏమంటారో?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు ముఖ్యమంత్రి పేరుని పెడితేనే గా చంద్రబాబుకి ప్రచార ఆర్భాటాలు ఎక్కువ అంటూ విరుచుకుపడిన ఈ నేతలు ఇప్పుడు తన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల పత్రాలపై, ఇళ్లపై నువ్వే మా నమ్మకం అంటూ చేస్తున్న ఈ ఆర్బాటాలను ఏమనాలో? చివరకు పిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాల పై కూడా జగన్ ఫోటోలను ముద్రిస్తుంటే మరీ ఇంతలా ఆరాటపడాలా? అనిపిస్తుంది.

ADVERTISEMENT

తాను ప్రతిపక్షం లో ఉన్నప్పుడు దొంగ ఓట్లు అంటూ విమర్శించిన ఈ వైసీపీ పెద్దలు ఇప్పుడు వారు అధికారంలో కి రాగానే ఉన్న ఓట్లను రద్దుచేస్తూ కొన్ని లక్షల ఫేక్ ఐడీ లను సృష్టిస్తూ చేస్తున్న కార్యక్రమాలకు సమాధానం ఎక్కడ? పవన్ ప్యాకేజ్ తీసుకున్నాడు అంటూ గత కొన్నేళ్లుగా చేస్తున్న ఈవార్తలకు ఒక్క ఆధారం చూపలేక పోయారు. మరి ఇప్పుడు జగన్ సోదరి షర్మిల తాను తెలంగాణ లో పెట్టిన టి వైసీపీ పార్టీని ఎంత ప్యాకేజీ కి కాంగ్రెస్ పార్టీలో కలుపుతుందో కూడా వైసీపీ పెద్దలు సెలవిస్తే బాగుంటుంది.

ఒక్కకేసులో రిమాండ్ కి వెళ్తేనే అవీనీతి పరుడైన చంద్రబాబు మరి 32 కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్ ను ఏమనాలి? చంద్రబాబు రాష్ట్రంలో మద్యం అమ్మి ఖజానాను నింపుతున్నారు అన్న నోర్లు ఇప్పడు తన సొంత బ్రాండ్ల మద్యంతో ప్రజల ప్రాణాలను హరిస్తూ ఎవరి ఖజానాను నింపుతున్నారో? కూడా చెప్పాలి.

అధికారంలో వచ్చిన వారం రోజులలో సీపీఎస్ రద్దు అంటూ తొడలు కొట్టిన ఈ పసివాడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారో? కరెంటు చార్జీలు పెంచేదే లేదు అంటూ ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాటకు ఇప్పుడు బిల్లులు తగ్గేదెలా అన్న చందంగా మార్చింది ఎవరో? 25 కి 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి ఆంధ్రుల కాళ్ల దగ్గరకు తెస్తా అంటూ చేసిన బాహుబలి సేభదాలు ఎటుపోయాయో?

క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి కానీ పోలవరం రాత మారడం లేదు. దీనికి సమాధానం ఆ శాఖ మంత్రికే తెలియదు.. కావలనంటే సినిమా కలెక్షన్ల లెక్కలు చెప్పగలరు సదరు మంత్రివర్యులు. కోడికత్తి కేసులో అసలు నిజాలు బయటకొస్తాయా? వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతున్నదా? రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికెషన్స్ ఉంటాయా? రహదారుల తీరు మారుతుందా?

ఆంధ్రప్రదేశ్ ఈ అప్పుల ఊబిలో నుంచి బయట పడుతుందా? ఇలా ఎటు చూసినా వైసీపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షమే కురుస్తుంది. రానున్నది ఎన్నికల కాలం. విపక్షాలు ఇటువంటి ప్రశ్నలనే సందిస్తుందని ముందుగానే ఊహించిన జగన్ తనకు అలవాటైన డైవర్టిన్ పొలటిక్స్ నే నమ్ముకుని బాబు అరెస్టుతో ముందుకెళ్లారు. ఇక ఇప్పుడు అన్ని ప్రశ్నలకు కలిపి వైసీపీ ఇచ్చే సమాధానం బాబు అవినీతి పరుడు., పవన్ ప్యాకేజీ స్టార్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్.. ఈ ఉపశమనం అవసరమే!

రాజకీయాలు హుందాగా సాగుతున్నప్పుడే రాష్ట్రాలలో, దేశంలో రాజకీయ వాతావరణం కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలలో అటువంటి హుందాతనం తగ్గిపోయింది.…

8 seconds ago

Pawan Kalyan Wants Fair Share for JanaSena in Local Polls

JanaSena chief and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan has asked TDP and BJP…

23 minutes ago