నాని పై నో కరోనా ఎఫెక్ట్

No Covid19 effect to actor nani moviesకరోనా వైరస్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లు ఎప్పుడు తెర్చుకుంటాయో తెలియని పరిస్థితి. దీనితో ఇండస్ట్రీ లో బిజినెస్ అంతా ఆగిపోయింది. పరిస్థితి పై క్లారిటీ వచ్చాకా చూద్దాం అన్నట్టు చాలా మంది బిజినెస్ కు దూరంగా ఉంటున్నారు.

దీనితో నిర్మాతలకు సంకటస్థితి వచ్చి పడింది. అయితే నాని దీనికి అతీతంగా ఉన్నాడు. అతని తరువాతి సినిమా… టక్ జగదీష్ రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. లక్ష్మణ్ ఈ హక్కులను రూ .22 కోట్ల మంచి ధరకు కొనుగోలు చేశారు. అతను గతంలో దిల్ రాజు యొక్క భాగస్వామి అయితే ఇటీవల తన సొంత డిస్ట్రిబ్యూషన్ హౌస్ ను పెట్టారు.

ADVERTISEMENT

ఇప్పటివరకు 40% షూటింగ్ పూర్తి అయ్యింది. కాస్త కేసులు తగ్గితే మిగితా షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తుంది చిత్ర బృందం. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది మ‌జిలీ తో సూప‌ర్ హిట్‌ను అందుకున్న‌ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ మరో సూపర్ స్క్రిప్ట్‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌` రూపొందిస్తున్నారని చిత్ర బృందం అంటుంది.

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` ఫేమ్ ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మరోవైపు.. నాని మరో సినిమా ‘వీ’ థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతుంది. వచ్చే నెల 5న ఈ సినిమా విడుదల అవుతుందని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories