టీఆర్ఎస్ లో ‘చెల్లని పైసా’గా మారిన ఎర్రబెల్లి!

no preference to errabelli dayakar rao in TRSతెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చి ‘కారు’ ఎక్కిన ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీ-టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి… ఎర్రబెల్లి ఇలాకాలోనే సెటైర్లు సంధించారు. రాజకీయంగా భిక్ష పెట్టి, అన్ని పదవులను కట్టబెట్టిన టీడీపీకి ఎర్రబెల్లి ద్రోహం చేస్తూ టీఆర్ఎస్ లో చేరాడని ఆరోపించారు.

ADVERTISEMENT

టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఎర్రబెల్లి ప్రస్తుతం టీఆర్ఎస్ లో చెల్లని పైసగా మారాడని, టీడీపీలో ఉండగా ఎర్రబెల్లికి పదవులు ఇవ్వకుండా ఉండి ఉంటే…. ఇప్పటికీ ఎర్రబెల్లి రేషన్ డీలర్ గానే ఉండేవాడని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT
Latest Stories