‘స్మార్ట్ సిటి’స్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందా?

No Smart Cities for Telanganaకేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదలైంది. కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ జాబితాను ప్రకటించారు.

భువనేశ్వర్ (ఒడిశా), పూణె (మహారాష్ట్ర), జయపుర (రాజస్థాన్), సూరత్ (గుజరాత్), కోచి (కేరళ), జబల్ పూర్ (మధ్యప్రదేశ్), నూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), కాకినాడ (ఆంధ్రప్రదేశ్), షోలాపూర్ (మహారాష్ట్ర), కోయంబత్తూర్ (తమిళనాడు), బెళగావి (కర్ణాటక), దావణగెరె (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), గౌహతి (అసోం), చెన్నై (తమిళనాడు), లూథియానా (పంజాబ్), భోపాల్ (మధ్యప్రదేశ్), ఉదయ్ పూర్ (రాజస్థాన్), ఇండోర్ (మధ్యప్రదేశ్).

ADVERTISEMENT

అయితే ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా ఎంపిక చేయకపోవడం పట్ల తెలంగాణా అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వంపై కారాలు, మిరియాలు నూరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రచారానికి పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని పార్టీ వర్గాలకు సూచనలు అందినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories