నోస్ట్రడామస్ మాట… 2014 నుండి 2026 వరకు మోడీదే హవా!

Narendra Modi Kiren RiJijuప్రపంచానికి పరిచయం చేయనవసరం లేని పేరు నోస్ట్రడామస్. సైన్సు పరంగా గానీ, జ్యోతిష్య పరంగా గానీ ఈ ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్న ఉదంతం విజ్ఞులకు విదితమే. మన ‘బ్రహ్మం’ గారి మాదిరి 1555లోనే ప్రపంచ వింతలు అంచనా వేసి చెప్పిన నోస్ట్రడామస్, 2014 నుండి 2026 వరకు భారతదేశం ఒక మధ్యవయస్కుని చేతిలో వెలిగిపోతుందని చెప్పినట్లుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ‘అమేజింగ్ ఫ్యాక్ట్స్’ పేరిట రాసుకున్న పుస్తకంలో పొందుపరిచినట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంఖ్యా బలం కూడా తోడయ్యిందట. దాని వివరాలు పరిశీలిస్తే…

ADVERTISEMENT

ప్రస్తుత లోక్ సభలో వివిధ పార్టీల సంఖ్యా బలం:
బీజేపీ – 283 సీట్లు; 2+8+3 = 13,
ఎన్డీయే – 337 సీట్లు; 3+3+7 = 13,
యూపీఏ – 58 సీట్లు; 5+8 = 13,
ఇతరులు – 148 సీట్లు; 1+4+8 = 13.

“దాదాపు 450 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ఈ విషయాన్ని అంచనా వేశారట. 2014 నుంచి 2026 వరకూ ఇండియాకు నాయకత్వం వహించిన ఓ వ్యక్తిని తొలుత ద్వేషిస్తారని, అయితే ఆ తర్వాత ఆయన మీద ఎంతో ప్రేమను చూపుతారని, భారతదేశ దశ, దిశలను మారుస్తారని పేర్కొన్నట్లుగా కేంద్రమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచానికే మార్గనిర్దేశకుడవుతాడని, ఆయన నాయకత్వంలో భారత్ గ్లోబల్ మాస్టర్ గా ఎదుగుతుందని, ఎన్నో దేశాలు భారత గొడుగు కింద ఉంటాయి” అని నోస్ట్రడామస్ చెప్పినట్టు రిజిజు వ్యాఖ్యానించారు. ఇంతకీ కేంద్రమంత్రి గారు చెప్పదలుచుకున్న విషయం ఏమిటో అర్ధమైంది అనుకుంటా..!

ADVERTISEMENT
Latest Stories