“నోటా” టాక్ – విజయ్ కు “బిగ్” బ్రేక్?!

NOTA movie Public Talk‘పెళ్లిచూపులు’ సక్సెస్ అయిన తర్వాత… ఈ సినిమా విజయం సాధిస్తుందని అనుకున్నాం గానీ, ఇంత విజయం ఊహించలేదు! ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ తర్వాత… సేమ్ డైలాగ్స్… అలాగే ఇటీవల ‘గీత గోవిందం’ అనూహ్యమైన సక్సెస్ తర్వాత కూడా అవే మాటలు..! విజయ్ దేవరకొండ బహిరంగంగా అన్న వ్యాఖ్యలివి.

[m9ad]

ADVERTISEMENT

దీంతో తన తాజా సినిమా ‘నోటా’కు కూడా అదే రకమైన విజయం దక్కుతుందని భావించారో ఏమో గానీ, ఈ సారి ముందస్తుగానే సినిమా సక్సెస్ పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు విజయ్. మరి బొమ్మ ధియేటర్లలోకి వచ్చేసింది. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? మునుపటి మూడు సినిమాల మాదిరే ‘టాక్’ వినపడుతోందా? మరో సక్సెస్ విజయ్ ఖాతాలో పడినట్లేనా? అంటే…

ఈ సారి విజయ్ దేవరకొండకు “బిగ్” బ్రేక్ లభించేలా “నోటా” ఫస్ట్ టాక్ వెలువడుతోంది. యుఎస్ ప్రీమియర్స్ మొదలుకుని, ఏపీ, తెలంగాణాలలో పడిన ముందు షోల వరకు “నోటా”కు భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ‘యావరేజ్ టు బిలో యావరేజ్’ ఫస్టాఫ్ అని… సెకండాఫ్ తో ‘నోటా’ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంటుందన్న టాక్ వెలువడుతోంది.

వరుస సక్సెస్ లతో మంచి ఉత్సాహంలో విడుదల చేసిన “నోటా”కు ఈ టాక్ బహుశా విజయ్ దేవరకొండ ఊహించాడో లేదో గానీ, ఈ సారి ప్రేక్షకుల తీర్పు విజయ్ కు రివర్స్ గా రానుందని బలంగా వినపడుతోంది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాలు కూడా అమితమైన ఆసక్తితో ఉన్నాయి. పాజిటివ్ టాక్ తో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం సాధారణమే గానీ, నెగటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ లభించినపుడే హీరో స్టామినాకు నిదర్శనంగా ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories