దటీజ్ “విజయ్ దేవరకొండ” ఫర్ యు!

Vijay Deverakonda NOTA Trailer Talkనేటితరం కధానాయకులలో విజయ్ దేవరకొండను మించి పబ్లిసిటీ చేసే హీరో ఎవరూ లేరని చెప్పడంలో సందేహం లేదు. తన సినిమాకు ఎప్పుడు, ఎలా ప్రమోషన్ చేయాలో పక్కాగా వ్యూహరచన గావిస్తూ, ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విజయ్ దేవరకొండ, తాజాగా “నోట” రిలీజ్ డేట్ పై జరుగుతున్న తర్జనభర్జనలకు ఓ సమాధానం ఇచ్చారు.

[m9ad]

ADVERTISEMENT

‘నోటా’ రిలీజ్ డేట్ కు సంబంధించి జరుగుతున్న డ్రామాపై స్పందిస్తూ…. ఏ డేట్ ను రిలీజ్ చేయాలో మీరే చెప్పండి అంటూ అక్టోబర్ 5, 10, 18 తేదీలను ఆప్షన్ గా ఇచ్చాడు. నాలుగవ ఆప్షన్ గా ‘నోటా’ను కూడా పెట్టిన విజయ్, రిలీజ్ డేట్ ను అధికారికంగా శనివారం నాడు ప్రకటిస్తామని స్పష్టం చేసాడు.

‘గీత గోవిందం’ సినిమాలో ఓ పాటకు ప్రేక్షకుల గొంతు పెడతామని చెప్పి పబ్లిసిటీ చేసిన విజయ్, తాజాగా రిలీజ్ డేట్ విషయంలోనూ ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తూ “నోటా”కు తనదైన శైలిలో పబ్లిసిటీ చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కాలం నడుస్తోంది, అందుకే ఈయన గారు పట్టిందల్లా బంగారం అవుతోంది, ప్రాధమికంగా వెలువడుతున్న పోల్స్ ప్రకారం అయితే అక్టోబర్ 5వ తేదీ ముందువరుసలో ఉంది.

ADVERTISEMENT
Latest Stories