
2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వైసీపీ గత ఐదేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమిటి అని ఎవ్వరైనా ప్రశ్నిస్తే నేను బటన్ నొక్కాను అంటూ సమాధానం చెపుతున్నారు ముఖ్యమంత్రి వైస్ జగన్. ఆ బటన్ నొక్కడానికి ఎన్ని అప్పులు తెచ్చారో, ఎన్ని ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారో, ప్రజల మీద పన్నుల భారం ఎంత పెంచారో చెప్పలేరు కానీ బటన్ మాత్రం నొక్కాను అంటూ సగర్వంగా చెప్పుకుంటారు జగన్.
ముఖ్యమంత్రి అంటే కేవలం సంక్షేమ పథకాల బటన్లు నొక్కడమే అనుకుంటున్న జగన్ తన పదవి కాలం చివరి దశలో కూడా అదే బటన్ నొక్కడానికి మరోసారి కోర్ట్ ఆదేశాలను పాటించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈసీ ఆదేశాల మేరకు మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షాలు నడుచుకోవాల్సి ఉంటుంది.
ఇవన్నీ తెలిసి కూడా తానూ ప్రజలకు బటన్ నొక్కి మంచి చేయాలనీ చూస్తుంటే అధికారులను అడ్డుపెట్టుకుని బాబు ప్రజలకు మేలు చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు అంటూ ప్రచారం చేసుకోవడానికే జగన్ ఇప్పుడు బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ఎన్నికల గడువు ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి నగదు బదిలీ జరగడానికి వీలులేదు అంటూ ఆదేశించిన ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు హైకోర్టు న ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారం చేపట్టిన న్యాయస్థానం రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్ది దారుల ఖాతాలో ఎటువంటి నగదు జమ చేయవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నెల 13 పోలింగ్ తేదీ ముగిసే వరకు ప్రభుత్వం ఎటువంటి బటన్ నొక్కడానికి అనుమతి లేదంటూ తేల్చి చెప్పింది హైకోర్టు. ఎన్నికలకు రెండు రోజుల ముందు 14 ,165 కోట్ల నగదు లబ్ది దారుల ఖాతాలలో జమ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ తీర్పు వెలువరించింది హైకోర్టు. దీనితో పోలింగ్ తేదీ ముగిసే వరకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు అనేది స్పష్టమయింది.
హైకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని ఆశపడిన వైసీపీకి మరోసారి చుక్కెదురైయింది. ఎన్నికలకు రెండు రోజుల ముందు తానూ బటన్ నొక్కి దానికి బదులుగా ప్రజల చేత వైసీపీ ఫ్యాన్ కు బటన్ నొక్కించుకోవాలని అని ఆశపడిన జగన్ కు ఇప్పుడు బటన్ నొక్కే అవకాశం కేవలం ఓటర్లకు మాత్రమే అంటూ తీర్పు వెల్లడించి అనుకోని షాక్ ఇచ్చింది హైకోర్టు.
The Trump administration has launched a denaturalization drive against immigrant US citizens involved in criminal…
Actor Aamir Khan and director Ashutosh Gowariker are reuniting after 25 years for a new…