మొన్నటి మహానటి బయోపిక్ నుంచి నిన్నటి ఎన్ఠీఆర్ బయోపి వరకూ..ఇక రాబోయే వైఎస్సాఆర్…మరియు ఇతర బయోపిక్స్ పై కూడా మన క్రిటిక్స్ మరియు సినిమా రివ్యూస్ రాసే వాళ్ళు…బహుశా అదే రకంగా స్పందిస్తారేమో. దాదాపుగా అన్ని రివ్యూస్ లోను ఒకటే మాట సినిమా కొన్ని చోట్ల చాలా స్లో అయ్యింది అని, కొన్ని చోట్ల సాగదీసినట్లు ఉంది అని, ఈ తరానికి నచ్చకపోవచ్చు అని.
అయితే ఇక్కడ మనం అంతా అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంతే, ఈ తరమే…కాదు భవిష్యత్తు తరాలు కూడా ఖచ్చితంగా ప్రతీ బయోపిక్ ను చూసి తీరాలి..ఎందుకంటే అలనాడు జరిగిన..ఎన్నో విషయాలను కొన్నింటిని కథానుగుణంగా మార్చుతూ ఉన్నప్పటికీ అవన్నీ మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తెలుసుకోలేని విషయాలు..అయితే సినిమా వల్లనే అది సాధ్యం అవుతుంది.
ఇక మరో పక్క క్రిటిక్స్ కూడా సినిమా స్లో గా ఉంది అంటూ రాసే రాతల్లో అర్ధమే లేదు..ఎందుకంటారా..బయోపిక్స్ లో నిజ జీవితం..జరిగిన విషయాలు ఉంటాయి కానీ ఐటెం సాంగ్స్..ముమైత్ ఖాన్ సీన్స్ ఉండవ్ కదా..



