ఎన్టీఆర్ కు సిగరెట్ వెలిగిస్తున్న ఏఎన్నార్!

Balakrishna - Sumanth - NTR Biopicఏఎన్నార్ పుట్టినరోజును పురస్కరించుకుని, “ఎన్టీఆర్” బయోపిక్ నుండి ఏఎన్నార్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులను ఆశ్చర్యంలో నెట్టే విధంగా, తాజాగా మరో పోస్టర్ ను కూడా విడుదల చేసింది. టాలీవుడ్ కు మూలస్థంబాలు అన్నా… రెండు కళ్ళు అన్నా… అది ఎన్టీఆర్, ఏఎన్నార్ లేక్ చెందుతుంది.

[m9ad]

ADVERTISEMENT

అలాంటి ఎన్టీఆర్ – ఏఎన్నార్ లను ఓ పక్కన చేర్చి లేటెస్ట్ ఫోటోను రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ కు అగ్గిపెట్టె ద్వారా సిగరెట్ వెలిగిస్తున్న ఏఎన్నార్ ను చూడవచ్చు. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి నటసింహం బాలకృష్ణ కనిపిస్తుండగా, ఏఎన్నార్ రోల్ లో సుమంత్ దర్శనమిచ్చారు. నాడు ఎన్టీఆర్ – ఏఎన్నార్ లు ఎంత కలివిడిగా ఉన్నారో తెలియదు గానీ, ఈ ఫోటో మాత్రం వారిద్దరి మధ్య ధృడమైన అనుబంధం ఉందని చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT
Latest Stories