దసరా స్పెషల్ – ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఫస్ట్ టీజర్!

NTR Biopic Two Parts - Making Double Wrong Choices?క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “ఎన్టీఆర్” బయోపిక్ పై అంచనాలు ఒక్కో మెట్టు ఎక్కుతూ, ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. విడుదల అవుతోన్న ప్రతి పోస్టర్ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండడంతో, ఈ సినిమాపై అన్ని వర్గాలలోనూ అత్యంత ఆసక్తి నెలకొంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా నుండి దసరా స్పెషల్ గా ఓ అప్ డేట్ ను చిత్ర యూనిట్ అందించబోతోంది.

[m9ad]

ADVERTISEMENT

గురువారం సాయంత్రం 4.12 గంటలకు ఓ భారీ అప్ డేట్ రానుందని, అది ప్రేక్షకులందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అయితే అది ఎలాంటి అప్ డేట్ అయ్యుంటుందా? అన్న ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. ట్రేడ్ వర్గాల తాజా సమాచారం మేరకు ఈ బయోపిక్ నుండి మొదటి టీజర్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

ఇప్పటివరకు ఇచ్చిన అన్ని అప్ డేట్స్ కూడా చడిచప్పుడు లేకుండా సైలెంట్ గా విడుదల చేస్తూ హంగామా సృష్టించిన ఎన్టీఆర్ బయోపిక్ నుండి ముందస్తు సమాచారంతో విడుదల అవుతోంది అంటే, అది ఖచ్చితంగా టీజర్ అనే ప్రేక్షకులు నమ్ముతున్నారు. మరి చిత్ర యూనిట్ ఇవ్వబోతున్న అసలు ట్విస్ట్ ఏమిటో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories