కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “జనతా గ్యారేజ్” సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 12వ తేదీన విడుదలకు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేదీలే కాదు, ఫస్ట్ లుక్ నుండి రిలీజ్ డేట్ ట్రైలర్స్ వరకు అన్ని ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయని సోషల్ మీడియాలో సమాచారం హల్చల్ చేస్తోంది.
ఏప్రిల్ 8వ తేదీన ఉగాది కానుకగా “జనతా గ్యారేజ్” టైటిల్ ఆవిష్కరణను ప్లాన్ చేస్తున్నారని, ఏప్రిల్ 15వ తేదీన శ్రీరామనవమి నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఫస్ట్ టీజర్ ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట.
అలాగే రంజాన్ కానుకగా జూలై 6వ తేదీన మరికొన్ని పోస్టర్స్ ను, సినిమా ఆడియోను జూలై 24వ తేదీన విడుదల చేయాలని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కనపడుతోంది. ఇలా ఎప్పుడూ “జనతా గ్యారేజ్” వార్తల్లో నిలిపేలా ప్లాన్ చేసినట్లుగా టాక్. మరి ఇవ్వన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలి అంటే షూటింగ్ ప్రణాళికా బద్ధంగా జరగాలి. కొరటాల ప్లానింగ్ అయితే ‘అదుర్స్’ అంటున్నారు అభిమానులు.





