‘తారక్’ దూకుడుపై ‘ప్రకృతి’ ప్రకోపం!

NTR Nannaku Prematho collections in USAజూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం “నాన్నకు ప్రేమతో” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి భిన్న స్పందనలు వ్యక్తమైనప్పటికీ, యుఎస్ మార్కెట్ నుండి మాత్రం ఏకాభిప్రాయం వెలువడింది. జూనియర్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ తో సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.

తొలివారానికే దాదాపు 1.70 మిలియన్ డాలర్స్ వసూలు చేసి, రికార్డు స్థాయిలో 2 మిలియన్ వైపుకు పరుగులు పెడుతున్న సమయంలో యుఎస్ ను మంచు తుఫాన్ ముంచేసింది. దీని వలన అమెరికాలోని కొన్ని నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే చాలా ప్రాంతాల్లో సినిమా హాల్స్ మూతపడ్డాయి. దీంతో చిత్ర యూనిట్, తారక్ అభిమానులు భావించినట్లు “నాన్నకు ప్రేమతో” 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి చేరడం అసాధ్యంగా కనపడుతోంది. మొదటివారం జూనియర్ ప్రదర్శించిన దూకుడుకు ఇక బ్రేక్ పడినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

ఆ మాటకొస్తే ఒక్క తారక్ సినిమానే కాదు, ‘బ్లాక్ బస్టర్’ టాక్ తెచ్చుకున్న “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా కూడా మొదటి వారం సాధించిన వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంది. గతంలో సుకుమార్ – మహేష్ కాంభినేషన్ లో విడుదలైన “1 నేనొక్కడినే” కూడా ఈ మంచు బారిన పడి ముందుకు సాగలేకపోయిన విషయం తెలిసిందే. మొత్తానికి సుకుమార్ సినిమాలకు – యుఎస్ మంచుకు ఎదో అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories