ఎన్టీఆర్‌ మూవీకి పెద్ద చిక్కొచ్చింది!

Nannaku Prematho pongal releaseయంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మొదటే నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే అదే సమయంలో బాలకృష్ణ కూడా తన ‘డిక్టేటర్‌’ చిత్రంతో రావాలని నిర్ణయించుకున్నాడు. దాంతో బాబాయితో పోటీ వద్దనుకున్న ఎన్టీఆర్‌ ‘డిక్టేటర్‌’ చిత్రం విడుదల అయిన వారం లేదా పది రోజులకు తన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని తాజాగా టాలీవుడ్‌ నిర్మాతల కొత్త నియమ నిబంధనల ప్రకారం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు పెద్ద సమస్య వచ్చింది.

జనవరి 1 నుండి ఏదైనా ఒక సినిమా విడుదల తేదీ ఫిక్స్‌ అయిన తర్వాత మరే ఇతర కారణం వల్ల అయినా వాయిదా పడితే, ఆ సినిమా మళ్లీ విడుదల తేదీని నాలుగు వారాల తర్వాత ఫిక్స్‌ చేయాలంటూ నిర్మాత మండలి కొత్త రూల్‌ను తీసుకు వచ్చింది. దాంతో సంక్రాంతికి విడుదల చేయాలని భావించి, మళ్లీ ఇప్పుడు ‘డిక్టేటర్‌’ కారణంగా వాయిదా వేయాలని భావిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత అంటే ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగా సంక్రాంతికే విడుదల చేయాలి లేదా ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో విడుదల చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో పరీక్షల కారణంగా సినిమా హాల్స్‌లో సందడి ఉండదు. అందుకే ముందుగా అనుకున్న సమయానికే ఎన్టీఆర్‌ వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌ సైతం సంక్రాంతికే ఫిక్స్‌ అయితే ఒక్క రోజు గ్యాప్‌లో బాబాయి, అబ్బాయి ఢీ కొట్టడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories