‘బిగ్ బాస్’లో ఎన్టీఆర్ ఫైర్!

ntr serious on bigg boss contestants‘బిగ్ బాస్’ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా నిర్వహిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ వీకెండ్ లో మాత్రం ఫైర్ అయ్యారు. అవును… హౌస్ లో పార్టిసిపెంట్స్ మధ్య నెలకొంటున్న విభేదాలపై, అలాగే ఒకరిపై ఒకరు ప్రదర్శించుకుంటున్న హావభావాలను ఉద్దేశిస్తూ… మీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు అంటూ గత వారం రోజులుగా జరిగిన అంశాలపై పలు వీడియోలను ప్రసారం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

ముఖ్యంగా కల్పన – హరితేజలకు సంబంధించిన ఓ వీడియోను ప్రసారం చేస్తూ… అందులో హరితేజ ప్రదర్శించిన ముఖకవళికల అంశాన్ని వేలెత్తి చూపించగా… దానికి హరితేజ వివరణ ఇస్తుండగా, ఆపండి… ఆపండి… మీ నాటకాలు నేను వినదల్చుకోలేదంటూ కాస్త గట్టిగానే బదులిచ్చారు ఎన్టీఆర్. ఇప్పటివరకు సాగిన ‘బిగ్ బాస్’ కార్యక్రమంలో తారక్ ఇంత అగ్రెసివ్ గా ఎప్పుడూ లేరు. నవ్వుతూ… నవ్విస్తూ… సాగే కార్యక్రమం కాస్త ప్రస్తుతం ఉద్వేగభరితంగా మారింది.

ADVERTISEMENT

ఇందులో భాగంగానే ఓ తప్పు చేసిన మహేష్ కత్తి కూడా తాజాగా ‘బిగ్ బాస్’ హౌస్ నుండి ఎలిమినేషన్ రూపంలో బయటకు వచ్చేయగా, కల్పన, హరితేజ, దీక్షాపంత్ లలో మరొకరు ఈ ఆదివారం నాడు బయటకు వచ్చేయబోతున్నారు. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డు ఎంట్రీతో నవదీప్ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. నవదీప్ తో పాటు మరో హీరోయిన్ ఎంట్రీ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories