“నాన్నకు ప్రేమతో” సినిమాలో ఆలపించిన ‘ఫాలో ఫాలో…’ పాట ద్వారా తను బాత్రూం సింగర్ కాదు, ప్రొఫెషనల్ గాయకుడిని అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతకు ముందు కొన్ని పాటలకు తన స్వరం వినిపించినప్పటికీ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో పాడిన విధానం అందరి చేత ప్రశంసలను అందుకుంది.
ADVERTISEMENT
అయితే తన సినిమాలకే కాదు, ఇతర చిత్రాలకు కూడా తన స్వరం వినిపించాలని భావించిన జూనియర్ ఎన్టీఆర్, ఇటీవల కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సినిమాకు పాట పాడిన విషయం తెలిసిందే. యస్.యస్.తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను శివరాత్రి కానుకగా ఈ నెల 8 వ తేదీన విడుదల చేయబోతున్నారు. తెలుగులో కాకుండా పర భాషలో పాడిన పాట కావడంతో, ఈ పాటను జూనియర్ ఎలా పాడారో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
ADVERTISEMENT



