మరో విదేశీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి!

one more foreign visit for chandrababuఅధికారంలోకి వచ్చిన మొదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులే లక్ష్యంగా పలు దేశాలను సందర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు చంద్రబాబు చేసిన పలు పర్యటనలు సానుకూల ఫలితాన్ని ఇవ్వగా, తాజాగా మరో విదేశీ పర్యటనకు సన్నద్ధం అవుతున్నారు.

ఈ నెల 20వ తేదీ నుండి కొరియా దేశాల్లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం సిద్ధమైంది. కొరియా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు 25వ తేదీ దాకా అక్కడే ఉంటారు. ఈ పర్యటనలో సిఎం చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తో పాటు వివిధ కీలక శాఖల అధికారులు కూడా వెళ్లనున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories