బిజెపియేతర రాష్ట్రాలలో అనేక ఆపరేషన్స్ ను ప్రారంభించిందన్న టాక్ ఓ వైపు రాజకీయ వర్గాలలో హల్చల్ చేస్తుండగా…, సినీ ప్రపంచంలో “ఆపరేషన్ గోల్డ్ ఫిష్” కొత్తగా తెరపైకి వచ్చింది. కృష్ణుడుతో “వినాయకుడు” సినిమాను తీసి సక్సెస్ అందుకున్న అడివి సాయికిరణ్, ఈ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడు.
ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ఖరారు చేసింది. సైలెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తారాగణం ఎవరో అన్నది మాత్రం వెల్లడించలేదు. గన్ పట్టుకుని వెనక్కి తిరిగి ఉన్న ఈ పోస్టర్ టైటిల్ లో…. ఓ వ్యక్తి పరిగెడుతున్న వైనం గమనించవచ్చు.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



