‘లిప్ లాక్’ సీన్స్ పై స్పందించిన లేటెస్ట్ హాట్!

Paayal Rajput responds on liplock“ఆర్ఎక్స్ 100” ఘనవిజయంతో ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హాట్ పేరు పాయల్ రాజ్ పుత్. ఎంతోమంది హీరోయిన్లు రిజెక్ట్ చేసిన పాత్రను ధైర్యంగా పోషించిన పాయల్ కు, అంతకు తగ్గ గుర్తింపే వచ్చింది. ముఖ్యంగా పాయల్ చేసిన లిప్ లాక్ అండ్ బోల్డ్ సీన్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సదరు అంశాలపై స్పందించింది ఈ లేటెస్ట్ హాట్ బ్యూటీ.

ADVERTISEMENT

నిజానికి ముద్దు సన్నివేశాల గురించి తొలుత భయపడ్డ మాట వాస్తవమేనని, కానీ హీరో కార్తీకేయ చాలా ప్రొఫెషనల్ గా ప్రవర్తించడంతో తనకున్న ఇబ్బంది తొలగిపోయిందని, ‘యాక్షన్’ అని చెప్పగానే సీన్ లోకి వెళ్ళిపోయి, ‘కట్’ అని చెప్పగానే సీన్ నుండి బయటకు వచ్చేసి ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళమని, ఈ సందర్భంగా డైరెక్టర్ అజయ్ భూపతిపై కూడా ప్రశంసలు కురిపించింది.

ఏ లిప్ లాక్ సీన్ కూడా రెండో సారి షూట్ చేయలేదని, రెండు మూడు యాంగిల్స్ లో చిత్రీకరణ కోసం ముద్దు సన్నివేశాలపై ముద్దు సన్నివేశాలను రిపీట్ చేసారు తప్ప, వన్ మోర్ షాట్ అన్న మాట దర్శకుడి నోట నుండి రాలేదని చెప్పుకొచ్చింది పాయల్. తెలుగులో మంచి అవకాశాలే వస్తున్నాయని చెప్పిన ఈ పంజాబీ సంచలనం, అన్నీ కుదిరితే ఇక్కడే సెటిల్ అవుతానేమోనని కూడా అభిప్రాయ పడింది.

ADVERTISEMENT
Latest Stories