ఇండియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పద్మ అవార్డులను 2016 సంవత్సరానికి గాను మోడీ సర్కారు ప్రకటించింది. ఈ పద్మ అవార్డుల్లో సినీ సెలబ్రిటీలకు పెద్ద పీట వేసినట్టు కనపడుతోంది. ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు, అన్ని భారతీయ భాషల్లోను చిత్రాలను నిర్మించి, రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ప్రపంచంలోనే అత్యాధునిక సినీ స్టూడియో అధినేతగా, మీడియా మొఘల్ గా ఉన్న రామోజీరావుకు భారత రెండవ అత్యున్నత పురస్కారం “పద్మ విభూషణ్” అవార్డులు దక్కాయి.
వీరితో పాటు బీజేపీ నాయకుడిగా ఎదుగుతున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్ కు “పద్మభూషణ్” అవార్డులు, ప్రియాంకా చోప్రా, అజయ్ దేవగణ్, ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళిలకు “పద్మశ్రీ” ఆవార్డులు లభించాయి. ప్రియాంకా చోప్రా ఇటీవలే ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు ప్రచారకర్తగా ఎంపికైన సంగతి తెలిసిందే.
పద్మ విభూషణ్ అవార్డుల జాబితా :
కుమారి యామినీ కృష్ణమూర్తి (కళలు, సంప్రదాయ నృత్యం), రజనీకాంత్ (కళలు, సినిమా), శ్రీమతి గిరిజా దేవి (కళలు, క్లాసికల్ ఓకల్), రామోజీరావు (సాహిత్యం, విద్య, జర్నలిజం), డాక్టర్ విశ్వనాధన్ శాంత (వైద్యం – ఆంకాలజీ), శ్రీశ్రీ రవిశంకర్ (ఇతరములు – ఆథ్యాత్మికం), శ్రీ జగన్మోహన్ (పబ్లిక్ అఫైర్స్), డాక్టర్ వాసుదేవ కల్ కుంతే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), దివంగత దీరూభాయ్ అంబానీ (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ), అరవింద్ దీక్షిత్ (విదేశీయుడు, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్).
పద్మభూషణ్ :
అనుపమ్ ఖేర్ (కళలు, సినిమా), ఉదిత్ నారాయణ్ (కళలు – నేపథ్య గానం), రామ్ వీ సుతార్ (కళలు – శిల్పాలు), హైష్ నామ్ కన్హయిలాల్ (కళలు – థియేటర్), వినోద్ రాయ్ (సివిల్ సర్వీసెస్), డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (సాహిత్యం, విద్య), ప్రొఫెసర్ ఎన్ ఎస్ రామానుజ తాతాచార్య (సాహిత్యం, విద్య), డాక్టర్ బ్రిజేందర్ సింగ్ హమ్ దర్ద్ (సాహిత్యం, విద్య, జర్నలిజం), ప్రొఫెసర్ డీ నాగేశ్వర్ రెడ్డి (వైద్యం – గ్యాస్ట్రోఎంట్రాలజీ), స్వామి తేజోమయానంద (ఇతరములు – ఆథ్యాత్మికం).





