Telugu

మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?

జమ్ము కశ్మీర్‌ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏమిటో అడిగి తెలుసుకొని మరీ కాల్చి చంపడం, మీ మోడీకి చెప్పుకోమని మహిళలకు సూచించడాన్ని మోడీ, అమిత్ షాలు నిజంగానే చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. హోం మంత్రి అమిత్ అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతో ప్రధాని మోడీ అత్యవసరంగా సమావేశమయ్యి ఈ ఉగ్రదాడి గురించి చర్చించారు.

ఈ దాడికి కొన్ని రోజుల ముందే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనుక ఇది ఆయన పధకం ప్రకారమే జరిగి ఉండవచ్చని జమ్ము కశ్మీర్‌ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అభిప్రాయపడ్డారు. నిన్న జరిగిన దాడికి మేమే బాధ్యులమని జమ్ము కశ్మీర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించుకున్నప్పటికీ, వారికి అవసరమైన శిక్షణ, ఆయుధాలు అన్నీ సమకూరుస్తున్నది పాక్ ఆర్మీయేనని శేష్ పాల్ వైద్ అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాద సంస్థ కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకొని హత మారుస్తుంటుంది. కానీ అప్పుడు ఇజ్రాయెల్ చేతులు ముడుచుకొని ఖండన ప్రకటనలతో సరిపెట్టకుండా హమాస్ నేతలను గుర్తించి, వారిపై దాడులు చేసి మట్టుబెడుతుంటుంది. కనుక భారత్‌ కూడా ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు.

తెలంగాణ బీజేపి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ముగ్గురూ కూడా పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవలసిందే అంటున్నారు. కనుక పాకిస్థాన్‌ మీద మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారత్‌పై ఎన్నిసార్లు దాడులు చేసినా ఎంతమంది అమయక ప్రజలను పొట్టన పెట్టుకున్నా ఖండన ప్రకటనలతో సరిపెట్టేవారు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్‌ వైపు పాక్ తొంగి చూసినా సహించే ప్రసక్తి లేదన్నట్లు ఆ దేశంతో చాలా కటువుగా వ్యవహరిస్తున్నారు.

కనుక ఇప్పుడూ ఈ ఉగ్రదాడులకు తప్పకుండా పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ భావిస్తున్నారు. మరి మోడీ, అమిత్ షాలు ఏం నిర్ణయిస్తారో కానీ పాక్ పాలకులకు కూడా ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించేవే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఏపీలో ఒకే రోజు మూడు ఆసక్తికర పరిణామాలు

ఈరోజు ఏపీ రాజకీయాలకు సంబంధించి మూడు ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. 1. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ…

32 seconds ago

Survey Report: Who Is Winning AP Local Poll Battle?

Andhra Pradesh is preparing for the upcoming local body election, which are barely a few…

19 minutes ago