ఆ చిన్న సినిమాతో నారప్పకు ఇబ్బందా?

palasa 1978 threat to narappaపలాస 1978 అనే చిన్న సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా 1978 కాలం నాటి పరిస్థితుల గురించి… అప్పుడు ఉన్న కులవివక్ష గురించి ఉంటుంది. వాటితో పాటు కొన్ని వివాదాస్పద విషయాల గురించి కూడా సినిమాలో ప్రస్తావించారట.

ADVERTISEMENT

దీనితో ఈ సినిమా కు సెన్సార్ బోర్డు వద్ద కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయట. భారీగా కట్స్ కూడా చెప్పారని సమాచారం. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్ప (అసురన్ తెలుగు రీమేక్) కు ఈ సినిమాకు పోలిక ఉండొచ్చని, పలాస 1978 ముందు వస్తుంది కాబట్టి ఆ తరువాత వచ్చే నారప్ప కు ఇబ్బంది అని అంటున్నారు.

అయితే సురేష్ ప్రొడక్షన్స్ పలాసని విడుదల చేస్తుంది. అటువంటి పోలిక ఏదైనా ఉంటే సురేష్ బాబు ఆ సినిమాకు అండగా నిలబడడు అని దగ్గుబాటి అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా… నారప్ప షూటింగ్ వేగంగా జరుగుతుంది. జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

సినిమాలో వెంకటేష్ గెట్ అప్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌కి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ పోస్టర్లతో చాలా వరకూ అనుమానాలు నివృత్తి అయినట్టే. వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి తిరిగొచ్చిన మణి శర్మ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories