‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న సినిమా ఇటీవలే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంభినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా సిద్ధమవుతున్న ఈ సినిమాను, ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల చేయనున్నారు. ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే ఇది చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కాదు, పవర్ స్టార్ అభిమాని రూపొందించిన ఫస్ట్ లుక్.
అయితేనేం… చిత్ర యూనిట్ మించిన క్వాలిటీ ఈ ఫస్ట్ లుక్ లో ఉండడంతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వెరైటీగా “ఇంజనీర్ బాబు” అని నామకరణం చేసి, ‘ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే…’ అని ట్యాగ్ లైన్ పెట్టి విడుదల చేసిన ఈ పోస్టర్ ఆహ్లాదకరంగా ఉంది. ‘ఫ్యాన్ మేడ్’ అయినా గానీ వీక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో, అభిమానులు ఉత్సాహంగా ఈ పోస్టర్ ను షేర్ చేసుకుంటున్నారు. కధకు సెట్ అయితే, ఈ టైటిల్ నే పెడితే సదరు అభిమానికి అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.



