హైందవ ధర్మాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు

hari-hara-veera-mallu--pawan

పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన హరిహర వీరమల్లు ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయింది. రత్నం సమర్పించగా, దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు.

హరిలా హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ, హరుడిలా శత్రుసంహారం చేసిన ఒక వీరుడు కథగా హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఔరంగజేబు అహంకారానికి, ఆధిపత్యానికి ఎదురు నిలిచి, సనాతన ధర్మ పరిరక్షణకై పోరాడి కనుమరుగైన యోధుడి కథ ఈ హరిహర వీరమల్లు.

ADVERTISEMENT

చరిత్ర శోధించలేకపోయిన ఎందరో వీరులలో ఒకడైన వీరమల్లు కథ చెబుతూ, ఆ బాలగోపాలాన్ని కట్టిపడేసిన భావోద్వేగాలు, ఆ కథనాన్ని నడిపిన తీరు అమోఘం. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ నటన సినిమా మొత్తానికి అసలైన హైలైట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎప్పుడో డాడీ, ఖుషి, జానీ లాంటి సినిమాల తర్వాత స్వయంగా ఆయన కంపోజ్ చేసిన ఫైట్ సినిమాకి మేజర్ హైలైట్. ఈ హరిహర వీరమల్లు ఆనాడు ధర్మంపై జరిగిన దాడి మాత్రమే కాదు, నేడు కొందరు నాయకులు చేస్తున్న, ప్రోత్సహిస్తున్న మత దాడులకు చెంపపెట్టు అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories