ప్రచారం విషయంలో తెగేసి చెప్పిన పవన్ కళ్యాణ్!

pawan-kalyan-avoids-GHMC eletion Campaignగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న టీడీపీ-బీజేపీ కూటమి, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను వినియోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ ను ప్రచారంలోకి దింపాలని చేస్తున్న యత్నాలు విఫలమవుతున్నాయి.

జీహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేయాలని పవన్ కు ఫోన్ చేసి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కోరగా.., ‘గబ్బర్ సింగ్’ ద్వితీయ భాగం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, ప్రస్తుతం రాలేనని చెప్పినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కొందరు నేతలు పవన్ ను స్వయంగా కలిసి ఇదే విషయాన్ని విన్నవించినా, పవన్ సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో గ్రేటర్ బరిలో ‘జనసేన’ అభ్యర్థులు ఉంటారని ప్రకటించిన పవన్, ఆపై వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories