పవన్ కళ్యాణ్ బర్త్ డేకు అనేక సర్ప్రైజ్లు

Pawan Kalyan Birthday పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన బర్త్ డే జరుపుకోనున్నారు. పవన్ బర్త్ డే అంటే అభిమానులకు పండుగ రోజు అనే చెప్పుకోవాలి. అయితే పవన్ కూడా అభిమానుల కోసం ఆ రోజున కొన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చెయ్యడం విశేషం. రాజకీయాల కోసమని సినిమాలను వదిలిపెట్టేస్తున్నా అని ప్రకటించి ఎన్నికల తరువాత పవన్ తిరిగి సినిమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

సెకండ్ ఇన్నింగ్స్ లో తాను నటిస్తున్న మొదటి చిత్రం…. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ఆరోజు విడుదల అవుతుందని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఆ రోజు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చిత్రబృందం ఒక హింట్ ఇచ్చింది.

ఇది ఇలా ఉండగా… పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక కొత్త చిత్రం ఆరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కిక్, రేస్ గుర్రం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు… కరోనా కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగులు ఆగిపోయాయి. అక్టోబర్ లో ఆయన వకీల్ సాబ్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే అది జరగాలంటే అప్పటికి థియేటర్లు ఓపెన్ అయ్యి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories