జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, వకీల్ సాబ్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఇది ఒక పీరియడ్ సినిమా అని అంటున్నారు.
మరోపక్క రాజకీయాలకు కూడా పవన్ కళ్యాణ్ టైం కేటాయిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ నెలలో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉండబోతున్నారు అని సమాచారం. ప్రస్తుతం క్రిష్ సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 12 వరకు ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చారు. ఆ తరువాత జనసేన ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా కొన్ని రోజులు రాజకీయంగా బిజీగా ఉంటారు.
స్థానిక ఎన్నికలు దగ్గర పడటంతో పార్టీ వ్యూహ రచన, బీజేపీతో సమన్వయపరచుకోవడం వంటి కీలక బాధ్యతలలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. ఎన్నికల ప్రచార సమయం ముగిశాకా అంటే ఈ నెల చివరి వారంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూట్ లో పాల్గొనబోతున్నారు. మొత్తంగా ఈ నెలలో ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండబోతున్నారు.
వకీల్ సాబ్ మే 15న వేసవి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దిల్ రాజు. అదే విధంగా నవంబర్ 13న దీపావళి సందర్భంగా క్రిష్ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఒకే ఏడాది పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల చెయ్యడం ఇదే తొలిసారి. ఏడాది చివరలో గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ సినిమా కూడా మొదలు పెట్టబోతున్నాడు.





