ఆడియో వేడుకలపై ‘పవన్’ నినాదంతో విసుగు చెందడం మరియు వర్తమాన రాజకీయ పరిస్థితులు మెగా బ్రదర్స్ ఇద్దరి మధ్యే కాదు, అభిమానులలోనూ చీలిక తెచ్చిందన్న విషయం తెలిసిందే. అయితే వీటిని రూపుమాపేందుకు ఇరు పక్షాల నుండి ఎవరూ మొగ్గు చూపక పోవడంతో… ఒకానొక సమయంలో మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ వాతావరణం అభిమానులను కలత చెందేలా చేసింది.
అయితే ఇదంతా… “సర్ధార్ గబ్బర్ సింగ్” ఆడియో విడుదలకు ముందు వరకు జరిగిన ఉదంతం. వీటన్నింటికి తెర దించుతూ చిరు – పవన్ ల కలయిక అభిమానులకు చూడముచ్చటగా ఉంది. అంతేకాదు, ‘సెల్ఫీ’ వంటి క్రేజీ విషయాలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, తన అన్నయ్యతో కలిసి ఒక సెల్ఫీ తీసుకోవడం… బహుశా ఇంతకు మించి మెగా అభిమానులు ఏమీ కోరుకోరేమో…! అనే విధంగా కన్నుల విందు చేసారు. ఈ సెల్ఫీలో ఫ్యాన్స్ కూడా భాగస్వామ్యం కావడం మరో విశేషం.
ADVERTISEMENT

ADVERTISEMENT



