పవన్ క్రేజ్ ను ఇలా కూడా వాడేసుకోవచ్చా!

pawan-kalyan-craze-at-peaksఏ వర్గంలో ఉన్నా, లేకున్నా యువతరంలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణే ‘కింగ్.’ వెండితెరపై పవన్ బొమ్మ కనపడితే విజిల్స్ పడాల్సిందే. అంతలా యూత్ ను ఊపేస్తున్న పవన్ కళ్యాణ్ ఇపుడు అభిమానుల వ్యక్తిగత జీవితాల్లో కూడా భాగస్వామ్యం అయిపోతున్నాడు.

ఓ అభిమాని తన జీవితంలో జరిగే వివాహ వేడుకలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామిని చేసేసాడు. ‘జనసేన’ పార్టీ గుర్తుతో కూడిన ప్రింటింగ్ ఒక వైపు, వివాహ వివరాలు మరోవైపు ముద్రించి ఉన్న శుభలేఖ ప్రస్తుతం సోషల్ మరియు వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూస్తూ మురిసిపోవడం పవన్ ఫ్యాన్స్ వంతవుతుంటే… అభిమానం కొత్త పుంతలు తొక్కుతోందని, దానిని ప్రదర్శించడానికి చూపుతున్న ఉత్సాహం వారి కుటుంబ సభ్యులపై కూడా ఉంటే బాగుంటుందని పలువురు పెదవి విరుస్తున్నారు.

ADVERTISEMENT

ఏది ఏమైనా ఎప్పుడు ఏదొక అంశంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే… ఈ వివాహానికి పవన్ అభిమానులందరూ ఆహ్వానితులే… భోజనాలు కూడా ఉంటాయని చెప్పడంతో… ‘వివాహ భోజనంబు’లో లెక్క తప్పుతుందేమో చూసుకోమంటూ పలువురు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories