7వ తరగతిలోనే పవన్ డిసైడ్ అయ్యారట!

pawan kalyan decided to come to politics in 7th standardగడిచిన కొన్ని గంటలుగా సోషల్ మీడియా జనులను ఓ వీడియో ఊపేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించిన ఈ వీడియోలో ఓ ‘అద్భుతమైన’ స్టేట్మెంట్ ను ఇచ్చారు. అదేమిటంటే… 7వ తరగతి చదువుతున్నపుడే పవన్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారట. ఏంటి వినడానికి షాకింగ్ గా ఉందా? స్వయంగా పవన్ కళ్యాణే ఈ వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

కట్ చేస్తే… నెటిజన్లకు ఆహారంగా మారింది ఈ వీడియో. ‘ఇంకా నయం గర్భంలో 7వ నెలలో ఉండగానే డిసైడ్ అయ్యానని చెప్పలేదు సంతోషం’ అని కొందరంటుంటే, పవన్ ఫ్యాన్స్ అంతా 7వ తరగతి చెందిన జాబితానే కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసారని మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నెటిజన్లకు హాస్యాన్ని పండిస్తున్నాయి.

నిజంగా ఈ వీడియోలోని సారాంశం పరిశీలిస్తే… పవన్ 7వ తరగతి అంటే 1980-81 నడుమ చదివి ఉండాలి. అప్పటికి నందమూరి తారక రామారావు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. అంటే ఎన్టీఆర్ కంటే ముందే తాను రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ చెప్పాలనుకున్నారా? లేక పువ్వు పుట్టగానే పరిమళించడం తన విషయంలో జరిగిందని ఫ్యాన్స్ కు సందేశం అందించాలన్న ప్రయత్నమా?!

ADVERTISEMENT
Latest Stories