గతంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ చెయ్యనిది ఇప్పుడు జరగబోతుంది

Pawan Kalyan - Director Krishజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, వకీల్ సాబ్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఇది ఒక పీరియడ్ సినిమా అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందట. మొదట్లో 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రానుండడంతో ప్రణాళిక మార్చుకున్నట్టుగా సమాచారం. తాజాగా నవంబర్ 13న దీపావళి సందర్భంగా విడుదలకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సముద్రం సెట్ లో ఒక పడవ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఇది హైలైట్ ఫైట్ అని అంటున్నారు. ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఆయనకు ఇదే మొదటి సారి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మే 15న వేసవి కానుకగా రానుంది. ఈ సినిమా నవంబర్ లో అంటే ఆరు నెలల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాల కేరీర్ లో ఒకే ఏడాది లో రెండు సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు.

ADVERTISEMENT
Latest Stories