పవన్ ఆ ఊహల్లో ఉన్నారన్నమాట!

Pawan Kalyan dreams on Chief minister chairవచ్చే ఎన్నికలలో అధికారం తమదే అంటూ ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తోన్న జనసేన అధినేత వ్యాఖ్యల్లో విశ్వాసం ఎక్కడ నుండి వచ్చిందో తాజాగా స్పష్టత వచ్చింది. ‘వచ్చే ఎన్నికలలో జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా, జనసేన మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు జరగబోదని’ లగడపాటి తనతో చెప్పారని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

ADVERTISEMENT

[m9ad]

ఒక్క ముక్కలో చెప్పాలంటే… కన్నడనాట కుమారస్వామి మాదిరి, ఏపీలో తాను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాననే భావన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో కనపడుతోంది. బహుశా ఇప్పటినుండే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని భావించుకుంటున్నారో ఏమో గానీ… పవన్ చేస్తోన్న విమర్శలు శృతిమించే విధంగా ఉంటున్నాయి. అయితే ఇక్కడ ఓ చిన్న లాజిక్ కూడా ఉంది.

రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చివరి రెండు నెలల్లో కూడా పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. లగడపాటి చెప్పిన నాటి నుండి ఎన్నికలకు వెళ్ళేవరకు… పవన్ గ్రాఫ్ తగ్గొచ్చు, పెరగొచ్చు. అయినంత మాత్రాన దానిని భుజాన వేసుకుని, ‘ఇక తనదే రాజ్యం’ అన్నట్లుగా విమర్శలు చేయడం అవివేకాన్ని ప్రదర్శిస్తుందే తప్ప, పరిణితిని కాదని తెలుసుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories